ఆయుర్వేదంలో తులసిని దివ్యఔషధంగా పేర్కొనడం జరిగింది. తులసిని అధికంగా తీసుకోవడం వల్ల సంతానలేమికి దారితీస్తుందని తాజాగా పరిశోధకులు చెబుతున్నారు.
శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధాలలో తులసిని ఉపయోగించబడుతున్నప్పటికీ.. దీని అతి వినియోగం ఇతర సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు.
తులసి ఆకులను ఎక్కువగా తినడం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. కొన్ని సందర్భాల్లో గర్భస్రావం కూడా దారితీస్తుంది.
హెర్బ్ గర్భాశయం, కటి ప్రాంతాలకు రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడం ద్వారా తీవ్రమైన గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది.
సంతానోత్పత్తిని ప్రభావితం చేయవచ్చు. కొన్ని అధ్యనాల్లో తులసి సంతానోత్పత్తిపై ప్రభావితం చూపుతుందని తేలింది. ఇది స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుందని తేల్చారు.
తులసి అధిక వినియోగం బ్లడ్ షుగర్ అసమతుల్యతకు కారణమవుతుంది. దీంతో మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంది.
తులసి తీసుకోవడం వల్ల దంత క్షయం సమస్య పెరుగుతుంది. దీంతో దంతల ఆరోగ్యం దెబ్బతేనే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.
తులసి ఆకులను ఎక్కువగా తినడం కారణమా కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో కాలేయ పనితీరుపై ప్రభావం చూపుతుంది.