నీలగిరి తైలంతో ఆ సమస్యలకు ఫుల్ స్టాప్..

TV9 Telugu

09 June 2024

తీవ్రమైన జలుబు పడిశం వంటివి పట్టినప్పుడు నీలగిరి తైలం మరగబెట్టిన నీళ్లలో  వేసి ఆవిరి పట్టిస్తే క్షణాల్లో జలుబు తగ్గుతుంది.

అనేక రకాల చర్మవ్యాధుల సమస్యలను నివారించడంలోనూ నీలగిరి తైలం సహాయపడుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

నీలగిరి నూనె గాయాలు నయం చేయడానికి, కీటకాలు కాటు, పగిలిన పాదాలు, పుళ్ళు వంటి వివిధ రకాల చర్మ పరిస్థితులకు చికిత్సగా ఉపయోగిస్తారు.

నీలగిరి నూనె నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఇది మౌత్ వాష్‌లు, టూత్‌పేస్ట్‌లను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు.

నీలగిరి తైలం మన చర్మంలో ఉండే సిరామైడ్ అనే కొవ్వు ఆమ్లం ఉత్పత్తిని పెంచడం ద్వారా పొడి చర్మాన్ని మెరుగుపరుస్తుంది.

సోరియాసిస్, చుండ్రు సమస్యతో బాధపడుతున్నవారు నీలగిరి తైలం నూనె పూయడం వల్ల పొలుసులు, చర్మం పొడిబారడం తగ్గుతుంది.

నీలగిరి తైలం సబ్బులు, క్లెన్సర్లు, స్టెయిన్ రిమూవర్లు, లాండ్రీ డిటర్జెంట్, గార్డెన్ స్ప్రే వంటి అనే శుభ్రపరిచే ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

నీలగిరి నూనెను చర్మంపై పూసినప్పుడు దోమలు, ఇతర కీటకాలను దరిచేరవు అంటున్నారు వైద్యలు, ఆరోగ్య నిపుణులు.