చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

08 December 2023

చలికాలంలో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా బీపీ పేషెంట్స్‌ చాలా జాగ్రత్తగా ఉండాలి.

నాడీ వ్యవస్థపై చలి చూపించే దుష్ప్రభావం, రక్త నాళాలపై పడే ప్రభావం కారణంగా హార్ట్ ఎటాక్‌లు సంభవిస్తున్నాయి.

చలికాలం సమయంలో ప్రతిరోజు ఉదయం జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

చలికాలంలో నీరు తక్కువ తాగడం వల్ల డీహైడ్రేషన్‌ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

ఉదయం నిద్రలేచిన వెంటనే గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. చలి కారణంగా వాకింగ్‌ చేయలేకపోయినా ఇంట్లో చిన్న చిన్న వర్కవుట్స్‌ చేస్తుండాలి.

చలికాలంలో తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ విషయంలో మార్పులు చేసుకోవాలని వైద్యులు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

శీతాకాలంలో పండ్లు, తృణధాన్యాలు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ వంటివి తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

చలికాలంలో విటమిన్‌ డీ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. మెడిటేషన్‌, యోగా కచ్చితంగా చేయాలని నిపుణులు చెబుతున్నారు.