బొప్పాయి తిన్న వెంటనే వీటిని తింటే డేంజర్ బెల్స్ మోగినట్టే..
TV9 Telugu
29 July 2024
ఆయుర్వేద వైద్యంలో బొప్పాయి పండుని వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఔషధంగా కూడా వినియోగిస్తారు.
అయితే బొప్పాయి తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదట. దీని వల్ల శరీరానికి పలు రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి.
బొప్పాయి పండు తిన్న వెంటనే పాలు, పెరుగు, జున్ను, పాల ఉత్పత్తులు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
బొప్పాయి పండులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను గ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.
బొప్పాయి తిన్న తర్వాత పాల ఉత్పత్తులు తీసుకుంటే జీర్ణ వ్యవస్థ దెబ్బ తిని గ్యాస్, మలబద్ధకం, పొట్టలో వాపు వంటి సమస్యలు వస్తాయి.
బొప్పాయి తిన్న తర్వాత గుడ్డును, గుడ్డుతో తయారు చేసిన ఆహారాన్ని తింటే జీర్ణ సమస్యలు, అజీర్తి, పొట్ట సమస్యలు, వికారం, వాంతులు వస్తాయి.
బొప్పాయి పండు తిన్న తర్వాత కూలింగ్ వాటర్ తాగడం వల్ల బొప్పాయిలో ఉండే పోషకాలు శరీరానికి అందకుండా పోతాయి.
బొప్పాయి పండు తిన్న తర్వాత ఇతర ఫ్రూట్ సలాడ్ తినడం వల్ల జీర్ణ క్రియ దెబ్బ తినే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి