డైలీ స్వీట్​ కార్న్​ తింటే బోలెడు బెనిఫిట్స్‌

TV9 Telugu

18 June 2024

స్వీట్‌కార్న్​ని చూడగానే ఎవరికైనా ఇట్టే నోరూరుతుంది. వేడివేడిగా కాల్చిన స్వీట్‌కార్న్‌ అయినా లేదా ఉడికించిన స్వీట్‌కార్న్‌ అయినా తినాలనిపిస్తుంది.

రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ స్వీట్‌కార్న్‌ చాలా బెటర్. కాలంతో సంబంధం లేకుండా ఏడాది మొత్తం ఈ తియ్యటి మొక్కజొన్నలు ల‌భిస్తాయి.

వీటిని ప‌చ్చిగా తిన్నా, ఉడ‌కబెట్టుకుని తిన్నా, ఇత‌ర ప‌దార్థాల‌తో క‌లిపి వండుకుని తిన్నా రుచిగా ఉంటాయి.

తియ్యటి మొక్కజొన్నల్లోని ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, మ్యాంగనీస్‌, ఐరన్‌, కాపర్‌, జింక్‌ వంటి ఖ‌నిజాలు.. ఎముకలు, కిడ్నీల పనితీరు మెరుగుప‌డేలా చేస్తాయి.

నిత్యం ఒత్తిళ్లతో ప‌నిచేసే వారికి వీటిలోని ఫినోలిక్‌ ఫైటో కెమికల్స్‌ హైపర్‌ టెన్షన్‌ను తగ్గిండచంలో బాగా పనిచేస్తాయని అంటున్నారు.

స్వీట్​కార్న్​లో ల్యూటిన్, జియాక్సాంథిన్ అనే రెండు యాంటీఆక్సిడెంట్లు కళ్ల ఆరోగ్యానికి మంచివని నిపుణులు అంటున్నారు.

అలాగే వయసు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ వంటి కళ్ల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నాయి.

స్వీట్‌కార్న్​లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుప‌రుస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం, పైల్స్‌తో బాధపడుతున్న వారికి ఈ స్వీట్‌కార్న్ మంచి ప‌రిష్కారం.