అధికంగా డ్రై ఫ్రూట్స్‌ తింటున్నారా.. ఇది మీ కోసమే..

TV9 Telugu

23 June 2024

మానవ శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో, దానికి అవసరమైన పోషకాలను అందించడంలో డ్రై ఫ్రూట్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

వీటిని నిత్యం తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.  కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రించి గుండె సంబంధిత సమస్యలను నిరోధిస్తుంది.

డ్రై ఫ్రూట్స్‌ను తినే విషయంలో సరైన పద్ధతి, సమయం చాలా అవసరం అంటున్నారు పోషకాహార మరియు వైద్య నిపుణులు.

డ్రై ఫ్రూట్స్ వార్మింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ కారణంగానే రాత్రిపూట ఎక్కువ మొత్తంలో డ్రై ఫ్రూట్స్ తిన్న వారి శరీరంలో శరీర ఉష్ణోగ్రతను పెరుతుంది.

ఇంకా శరీర ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. అందుకే వీటిని అధిక మొత్తంలో తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు.

అధిక మొత్తంలో పోషకాలను కలిగిన డ్రైఫ్రూట్స్‌ని తింటే బరువు సమస్య ఎదురవుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

రాత్రిపూట పడుకునే ముందు తింటే శరీరం వీటిని ఆరగించిుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా బరువు సమస్య ఎదువుతుంది.

నిద్రించే ముందు డ్రై ఫ్రూట్స్ తింటే జీర్ణ సమస్యలు కూడా ఎదురవుతాయి. కడుపులో వేడి పుట్టించి, కడుపు నొప్పి, మల  బద్ధకం, అజీర్తి సమస్యలు వెంటాయడుతాయి.