రాత్రి భోజనం ఆలస్యంగా తింటే కోలోరెక్టల్ క్యాన్సర్‌ ముప్పు

TV9 Telugu

16 June 2024

ఆలస్యంగా రాత్రి భోజనం చేయొద్దని.. ముఖ్యంగా కొవ్వులు, చక్కెరతో కూడిన ఆహారం ఎక్కువగా తినొద్దని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు.

పడుకోవటానికి 3 గంటల్లోపు భోజనం చేసేవారిలో పెద్దపేగు చివర క్యాన్సర్‌ వచ్చే ముప్పు పెరుగుతున్నట్టు తాజాగా బయటపడింది.

రాత్రి భోజనాన్ని పెందలాడే తినేవారితో పోలిస్తే ఆలస్యంగా తినేవారికి చిన్న కణితి అడినోమా ఏర్పడే అవకాశం 46% ఎక్కువగా ఉంటుంది

వీటిలో మూడు కన్నా ఎక్కువ కణితులు తలెత్తితే ముప్పు 5.5 రెట్లు ఎక్కువ. ఇలాంటి కణితుల్లో కొన్ని క్యాన్సర్‌గా మారే ప్రమాదముంది.

ఇంతకీ పెద్దపేగు క్యాన్సర్‌కూ ఆలస్యంగా భోజనం చేయటానికీ మధ్య సంబంధం జీర్ణకోశంలోని జీవగడియారం గతి తప్పటమే.

ఆలస్యంగా భోజనం చేసినప్పుడు మెదడు అది రాత్రి సమయమని, ఇక పేగులేమో పగలని అనుకుంటాయని చెబుతున్నారు నిపుణులు.

పైగా ఆలస్యంగా భోజనం చేసేవారు చాలాసార్లు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోరు. కొవ్వు, చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తింటుంటారు.

ఇది పేగుల్లోని జీవగడియారాన్ని అస్తవ్యస్తం చేయటమే కాదు, బరువు పెరగటానికీ దారితీస్తుంది. ఇదీ క్యాన్సర్‌ ముప్పును పెంచేదే.