రోజూ ఖర్జూరాన్ని నెయ్యితో కలిపి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు..

16 December 2023

ఖర్జూరంలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిసి శక్తిని ఇవ్వడానికి బూస్టర్‌గా పనిచేస్తాయి.

ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నెయ్యి కూడా జీర్ణ సమస్యలను అరికడుతుంది.

రెగ్యులర్‌గా మలబద్ధకం, ఇతర పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఖర్జూరంతో నెయ్యి తింటే మేలు కలుగుతుంది.

ఖర్జూరం, నెయ్యి కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చలికాలంలో ఖర్జూరం, నెయ్యి కలిపి తినడం వల్ల కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

నెయ్యి, ఖర్జూరం రెండింటిలోనూ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ముఖ్యంగా శీతాకాలంలో మహిళల ఆరోగ్యానికి నెయ్యి, ఖర్జూరం కలయిక చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.

ఈ రెండు పదార్థాలను కలిపి తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని భర్తీ చేస్తుంది. రక్తహీనత కూడా తగ్గిస్తుంది.

నెయ్యి, ఖర్జూరం మిశ్రమాన్ని గర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాత కూడా తీసుకోవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.