21 February 2024

వెల్లుల్లి తినండి.. బరువు తగ్గండి

TV9 Telugu

మన దేశంలో పేదవాడి దగ్గర నుంచి ధనవంతుడి వరకు అందరి ఇళ్లల్లో వెల్లుల్లి కామన్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. 

వెల్లుల్లి వాడకంతో ఎంతో సులభంగా బరువు తగ్గవచ్చని పలు పరిశోధల్లో తేలింది. రోజు ఆహారంలో చేర్చుకోవడంతో జీర్ణక్రియ రేటు కూడా పెరుగుతోంది.

 వెల్లుల్లిలో  ఎన్నో అనారోగ్యాలను తగ్గిస్తుంది. లోబీపీ, జలుబుతో బాధపడేవారు వెల్లుల్లి తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది. నడుము చుట్టు ఉండే కొవ్వును తగ్గిస్తుంది.

 వెల్లుల్లిలో విటమిన్ B6, విటమిన్ C, ఫైబర్, కాల్షియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. అధిక బరువును తగ్గించుకోవడంలో సాయపడతాయి.

8 వారాల పాటు ఎలుకలపై ప్రయోగించినపుడు వాటి శరీరం బరువు, కొవ్వు నిల్వలు శాతం తగ్గినట్టు పరిశీధనలో తేలింది.

ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని, అంతేకాదు పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తోంది. జలుబు, ఫ్లూ వంటివి తగ్గించడానికి ఉపయోగపడతాయి.

 బరువు తగ్గడానికి రెండు మూడు వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో తెల్లారే వరకు నాననివ్వాలి.

ఉదయమే వెల్లుల్లి ముక్కలను తీసివేసి నల్లని మిరియాల పొడి వేసి కలియ తిప్పాలి జూ ఉదయాన్నే ఏమి తినకముందే తీసుకోవాలి.