ఈ లక్షణాలుంటే.. కిడ్నీ సమస్యలున్నట్లే. 

22 october 2023

కిడ్నీ సస్యలున్న వారి మూత్రం రంగు, వాసనలో మార్పు కనిపిస్తుంది. అలాగే మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇక నీరు ఎంత తాగినా మూత్రం రావడం లేదంటే కిడ్నీల పనీతీరుపై ప్రభావం పడ్డట్లే భావించాలి. మూత్ర పిండాలు మూత్రం ఉత్పత్తి ఆపేస్తే మూత్రం తగ్గిపోతుంది.

మూత్రంలో రక్తం కనిపించినా కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లు భావించాలి. మూత్ర పిండాల ఫిల్టర్లు దెబ్బతిన్నప్పుడు, రక్త కణాలు మూత్రంలోకి లీక్‌ కావడం వల్ల ఇలా జరుగుతుంది.

మూత్ర పిండాలు దెబ్బతింటే శరీరంలో ప్రోటీన్‌లు నిల్వవు. మూత్రంలో ప్రోటీన్స్‌ లీక్‌ అవుతాయి. దీని కారణంగా కళ్ల చుట్టూ ఉబ్బుతుంది. 

నురుగుతో కూడిన మూత్రం వస్తున్నా కిడ్నీల పనితీరు దెబ్బతిందని భావించాలని నిపుణులు చెబుతున్నారు. మూత్రంలో నురగ కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

మూత్ర పిండాల పనితీరు దెబ్బతినడం వల్ల అసాధరణంగా చలిగా అనిపించడం వంటి సమస్యను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. 

శరీరంలో ఎలక్ట్రోలైట్‌ స్థాయిల్లో మార్పులు వస్తే మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కిడ్నీలు దెబ్బతింటే ఈ సమస్య వస్తుంది. ఏకాగ్రత కోల్పోతారు. 

కిడ్నీల పనితీరు దెబ్బతింటే రక్తంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. దీనివల్ల వికారం, వాంతులు వంటి సమస్యలు వెంటాడుతాయని నిపుణులు చెబుతున్నారు.