చలికాలంలో వీటిని తాగడం వల్ల డ్రై స్కిన్‌ సమస్యకు చెక్..

12 December 2023

చలికాలం సమయంలో తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేష‌న్ స‌మ‌స్య‌ల‌తో చ‌ర్మం క‌ళావిహీనంగా తయారవుతుంది.

చ‌లికి వ‌ణుకుతూ ఎక్కువ‌మంది త‌గినంత నీరు తీసుకోలేక‌పోవ‌డంతో డీహైడ్రేష‌న్ బారిన పడతారు. ఫలితంగా డ్రై స్కిన్‌కు దారితీస్తుంది.

చల్ల‌ని వాతావ‌ర‌ణం శ‌రీరంపై తేమ‌ను తొల‌గించ‌డంతో స్కిన్‌ పొడిబారుతుంది. కొన్ని రకాల ఆరోగ్య‌క‌ర పానీయాల‌తో డీహైడ్రేష‌న్ బారినుంచి బ‌య‌ట‌ప‌డవచ్చు.

కొన్ని పానీయాలతో చర్మం నునుపును, మెరుపును సంత‌రించుకునేలా చేయ‌వ‌చ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

చలికాలంలో డ్రై స్కిన్‌తో ఇబ్బంది ప‌డేవారు రోజుకు స‌రిప‌డా నీరు తాగితే స‌మ‌స్య నుంచి ఇట్టే బయటపడతారు.

నీటితో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉండే గ్రీన్ టీ తీసుకోవాలి. ద్ర‌వాహారం అధికంగా తీసుకుంటూ మ‌ద్యం, కేఫినెటెడ్ డ్రింక్స్‌ను మానుకోవాలి.

విట‌మిన్ సీ కోసం గోరువెచ్చ‌టి లెమ‌న్ వాట‌ర్‌, ఎల‌క్ట్రోలైట్స్ కోసం కొబ్బ‌రి నీళ్లు వంటివి తాగుతుండాలి.

కొబ్బ‌రి నీరు, హెర్బ‌ల్ టీలు, అలోవెరా జ్యూస్‌ తాగడం వల్ల చ‌లికాలంలో చ‌ర్మం నిగారింపును సంతరించుకుంటుంది.