వాకింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి
TV9 Telugu
14 January 2024
మనలో చాలామందికి వాకింగ్ చేసే పద్దతులు తెలియవు. నడుస్తున్నాం కదా.. ఆరోగ్యంగా ఉంటాంలే అనే అపోహలో ఉంటారు.
కానీ వాకింగ్ చేసే చాలామందికి తెలియని విషయాలున్నాయి. వీటి వల్ల చాలా నష్టాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు.
వాకింగ్ వల్ల చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గడంతో పాటు, గుండె సమస్యలు, బీపీ, కొలెస్ట్రాల్ వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.
వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే.... కొన్ని అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
మనం వాకింగ్ చేయడానికి మంచి స్థలం, పార్క్ లు, ఇంటి బయట తోట, పచ్చని వాతావరణం, సహజ కాంతి ఉండే ప్రదేశాలలో వాకింగ్ చేయాలి.
వాకింగ్ చేసే సమయంలో షూస్, దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బరువు లేని షూస్, నడవడానికి సౌకర్యవంతమైన దుస్తులు ఎంపిక చేసుకోవాలి.
వాకింగ్ చేసేటప్పుడు కొంతమంది కిందకి చూస్తారు. కొందరు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ ఉంటారు. అలా కిందకు చూడటం వల్ల వెన్ను, శరీర నొప్పిని కలిగిస్తుంది.
ఇప్పుడు తెలుసుకున్నారు కదా.. ఇకనుంచైనా ప్రతిరోజూ వాకింగ్ చేసినప్పుడు ఈ తప్పులకు దూరంగా ఉండండి అదే మంచిది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి