కాఫీ విషయంలో ఈ పొరపాట్లు చెయ్యకండి..
TV9 Telugu
20 August 2024
రోజూ ఉదయాన్నే చాలా మంది కాఫీ తాగాకనే తమ దినచర్యను ప్రారంభిస్తుంటారు. ఇక కొంత మందయితే బెడ్ దిగకముందే కాఫీ లాగించేస్తుంటారు.
ఇలా ప్రతిరోజూ కాఫీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కాఫీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ కొందరు మాత్రం కాఫీని దూరం పెట్టాలని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జీవక్రియల వేగం మందగించినవారు, యాంగ్జైటీతో బాధపడే వారు కాఫీకి దూరంగా ఉండాలి. అలాగే గర్భిణులు కూడా కాఫీ తీసుకోకుండా ఉండటమే మేలు.
జీవక్రియల వేగం మందకొడిగా ఉన్నవారికి కాఫీ తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు ఉత్పన్నం కావచ్చు అంటున్నారు.
జీవక్రియ సాఫీగా లేనట్లయితే కాఫీ తాగిన 9 గంటల వరకూ గాబరా, ఆందోళనగా ఉండటం వంటి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి.
ఆగోగ్యవంతులు మితంగా కాఫీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెంపొందడం వంటి పలు ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కాఫీతో పాటు కెఫీన్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను తీసుకుంటే మాత్రం స్ట్రెస్ లెవెల్స్, సెరటోనిన్ లెవెల్స్‌పై ఎఫెక్ట్ చూపుందుని హెచ్చరిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి