వీటిని పొరపాటున కూడా ఓవెన్‌లో హీట్ చేయకూడదు..
19 September 2023
పుట్టగుడుగులను రెండోసారి వేడి చేయడం వల్ల దానిలో పోషకలు అన్ని పోతాయి. దీని కారణంగా ఇన్ఫెక్షన్లు, అనారోగ్యం కలుగుతుంది.
ఉడకబెట్టిన గుడ్లు ఓవెన్‌లో అస్సలు వేడి చేయకండి. ఇలా చేయడం వల్ల గుడ్డు హానికరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
బ్రోకలీ తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే వీటిని రెండో సరి ఓవెన్‌లో హీట్ చేసి తింటే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
బీట్‌రూట్, క్యారెట్, బచ్చలికూర లాంటి వాటిలో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. అందుకే వీటికి కూడా ఓవెన్‌లో వేడి చేయకూడదు.
భద్రపరిచిన చనుబాలు ఓవెన్‌లో వేడి చేసి పసిపిల్లలకు తాగించడం అస్సలు మంచిది కాదు. దీనికి బదులు పాలపాత్రలో నీళ్లు మరిగించి వాటిలో గోరువెచ్చగా చేయొచ్చు.
పండ్లు ఫ్రిజ్‌లో ఉంచడం సహజం. అయితే అవి చల్లగా ఉన్నాయని ఓవెన్‌లో వేడి చేస్తి శరీరానికి హానికరంగా మారుతాయి.
కాఫీ లేదా టీ చల్లారిందని పొరపాటున కూడా వేడి చేయవద్దు. వీటిని మొదటిసారి వేడి చేసినప్పుడే తాగాలి. లేదంటే సమస్యలు తప్పవు.
ఉడికించిన బంగాళదుంపలు, ప్రొసెస్డ్ మీట్, టమాటా సాస్ వంటిని ఓవెన్‌లో వేడి చేస్తే వ్యాధుల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి