మామిడి ఆకులతో ఇలా చేస్తే జట్టు సమస్యలు ఖతం..
TV9 Telugu
21 October 2024
ప్రస్తుతకాలంలో జీవనశైలి కారణంగా జుట్టు రాలిపోవడం, త్వరగా నెరిసి పోవటం చాలామందిని వేధిస్తున్న సమస్యలు.
మీరు కూడా జుట్టు రాలడం వంటి సమస్యతో బాధపడుతున్నట్టయితే మామిడి ఆకులతో చేసిన హెయిర్ మాస్క్ ప్రయత్నించండి.
ముందుగా మామిడి ఆకులను శుభ్రంగా కడగి పేస్ట్‌లా చేసి, అందులో పెరుగు, ఉసిరి పొడి, హెన్నా పౌడర్, కొబ్బరి నూనె కలపాలి.
ఇప్పుడు దీన్ని జుట్టుకు పట్టించి 20-30 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా 3 రోజులకు ఒకసారి తరుచూ చేయండి.
మామిడి ఆకుల్లో తగినంత పరిమాణంలో ఉండే విటమిన్-ఎ, విటమిన్-సి వంటి పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
మామిడి ఆకుల్లోని పోషకాలు జుట్టు రాలడాన్ని నియంత్రించడమే మాత్రమే కాదు.. జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి.
మామిడి ఆకుల పేస్ట్‌ని తరుచూ తలకు అప్లై చేయడం వల్ల స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషన్‌ను మెరుగుపరుస్తుంది.
మామిడి ఆకులతో చేసిన పేస్ట్ అప్లై చేస్తే సహజంగా జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుందని అంటున్నారు నిపుణులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి