తరుచు రాత్రి షిఫ్టులలో పనిచేస్తే ఇన్ని నష్టాలా.?
TV9 Telugu
10 August 2024
ఎక్కువ సార్లు రాత్రి షిఫ్టులలో పనిచేసే వ్యక్తులు అనేక రుగ్మతల భారిన పడుతున్నట్టు పలు అధ్యయనాలు రుజువు చేశాయి.
రాత్రిపూట పనిచేసే వారికి జీర్ణవ్యవస్థ పనితీరులో మార్పులను గుర్తించారు. వెన్నుపూస సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.
తాజాగా 47,811 మంది నైట్ షిఫ్ట్ ఉద్యోగులపై కాగ్నిటివ్ ఫంక్షన్ పరీక్షలు చేశారు. 79 శాతం మందిలో జ్ఞాపకశక్తి సమస్యలు గుర్తించారు.
నైట్ షిఫ్టులలో పనిచేసే వ్యక్తుల సిర్కాడియన్ రిథమ్‌పై ఎఫెక్ట్ పడుతుంది. తద్వారా జ్ఞాపక శక్తిని కోల్పోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ న్యూరోసైన్స్ ప్రొఫెసర్ రస్సెల్ ఫోస్టర్ నైట్ షిఫ్ట్‌లకు సంబంధించిన అధ్యయనంలో కంటిచూపుపై ప్రభావాన్ని కనుగొన్నారు.
నైట్ షిఫ్టులు ఎక్కువగా పని చేసే వ్యక్తులు ఎక్కువగా వెన్నుపూస, నాడీ సంబంధింత సమస్యల భారిన పడుతున్నట్టు గుర్తించారు.
రాత్రి షిఫ్టులలో పనిచేసే ఉద్యోగుల్లో గుండె కొట్టుకునే వేగంలో మార్పులు చోటు చేసుకుంటున్నట్టు అధ్యయన నివేదిక వెల్లడించింది.
రాత్రిపూట పనిచేసే మహిళా ఉద్యోగులపై మరింత ఎఫెక్ట్ ఉంటుంది. కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి