కోతి కరిచినా రేబిస్ వస్తుందా..?
TV9 Telugu
30 June 2024
కుక్క కాటుకు గురైతే రేబిస్ టీకాలు వేస్తారు. ఈ వైరస్ తో పోరాడడానికి ఒకటే మార్గం త్వరగా రెస్పాండ్ అవ్వడమే.
ప్రతి సంవత్సరం కనీసం అరవై వేల మంది సరైన సమయానికి రేబీస్ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో ప్రాణాలు విడుస్తున్నారు.
జంతువు కాటుకీ, లక్షణాలు బయటపడడానికీ మధ్య ఉన్న కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారని అంటున్నారు నిపుణులు.
ఈ పీరియడ్ నాలుగు నుండీ పన్నెండు నెలల వరకూ ఉంటుంది. ఒక్కోసారి ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ కొన్ని రోజుల నుండి ఆరేళ్ళ వరకూ కూడా ఉండచ్చు.
అలాగే కోతుల కాటు వల్ల కూడా రేబీస్ రావచ్చు. కోతి కరిస్తే, రాబిస్ వైరస్ దాని లాలాజలం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
మీరు కోతి కాటుకు గురైనప్పుడు, ముందుగా ఆ ప్రాంతాన్ని నీటితో కడగాలి. గాయాన్ని కార్బోలిక్ పౌడర్ లేదా ఏదైనా సబ్బుతో బాగా కడగాలి.
వెంటనే, వైద్యుడిని సంప్రదించి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోండి. ప్రతి ఏడు రోజులకొకసారి రేబిస్ టీకా వేయండి.
మీరు టీకాలు వేయడం ద్వారా రేబిస్ ప్రమాదాన్ని నివారించవచ్చు. లేదంటే ప్రాణలకే ప్రమాదం ఉంటుందని అంటున్నరు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి