డెంగ్యూ వస్తే వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ కావాలా..?
TV9 Telugu
14 August 2024
డెంగ్యూ.. దీనిని 'ట్రాపికల్ ఫ్లూ' అని కూడా పిలుస్తారు. ఏడిస్ దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వ్యాపిస్తుంది.
డెంగ్యూ జ్వరం వచ్చిన వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ కావాలో.. లేదో.. అనే ఒక విషయంపై ఎందరికో సందేహాలు ఉంటాయి.
డెంగ్యూ విషయంలో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరడం సముచితం. ఎందుకంటే డెంగ్యూ ప్రారంభ లక్షణాలు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి.
జ్వరం మూడు రోజుల కంటే ఎక్కువ ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేదంటే సమస్య పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
డెంగ్యూ తీవ్రమైన కేసులు రక్తపు వాంతులు, కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. ఆసుపత్రిలో చేరడం వలన ప్రాణాలను కాపాడవచ్చు.
డెంగ్యూ చికిత్సలో యాంటీబయాటిక్స్ అవసరం లేదు. ఎందుకంటే ఇది వైరల్ వ్యాధి. దోమలను చంపడానికి క్రిమిసంహారక మందులను వాడండి.
ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే, డెంగీ, మలేరియా లాంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం కచ్చితంగా ఉంది.
డెంగీ అంటు వ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తుంది. జ్వరం వస్తే వెంటనే ఆసుపత్రుల్లో టెస్టులు చేయించుకోవాలంటున్నారు డాక్టర్లు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి