పచ్చసొన ఎందుకు తినాలో తెలుసా.. 

14 September 2023

పోషకాల లోపం గుడ్డులోని పచ్చసొనలో కోలిన్‌ అనే పోషకం ఉంటుంది. ఇది చికెన్, చేపలు, బంగాళదుంపలు, బియ్యం వంటి వాటిలో కనిపిస్తుంది.

పచ్చసొన

పూర్తిగా ఉడికించిన గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పచ్చసొనలో ఐరన్, జింక్‌ ఉంటాయి. మీరు దీనిని తినకపోతే ఈ పోషకాలు కోల్పోతారు.

పచ్చసొన

గుడ్లలో ప్రోటీన్‌ సమృద్ధిగా లభిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్‌ మినరల్స్, అమినో యాసిడ్స్, విటమిన్‌ డి, బి12 ఉంటాయి.

పచ్చసొన

అనేక అధ్యయనాల ప్రకారం గుడ్లు తినడం వల్ల శక్తి పెరుగుతుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.

పచ్చసొన

కళ్లను సురక్షితంగా ఉంచడమే కాకుండా చర్మం, జుట్టుకి కూడా మేలు చేస్తుంది. ఇందులో అధిక మొత్తంలో డైటరీ కొలెస్ట్రాల్‌ ఉంటుంది.

పచ్చసొన

దాదాపు ఒక గుడ్డులో 187 మి.గ్రా. కొలెస్ట్రాల్‌ ఉంటుంది. అయితే ఇది ఎప్పుడూ తీసుకునే మటన్‌ , ఐస్‌ క్రీం వంటి ఆహార పదార్థాలతో పోలిస్తే తక్కువే. 

పచ్చసొన

గుడ్డులోని తెల్లటి భాగాన్ని మాత్రమే తినడం వల్ల పచ్చసొనలో ఉండే ఎ, బి. ఇ. కె. విటమిన్లని పొందలేరు..

పచ్చసొన