అగరబత్తీలు వేయడం ఎంత హానికరమో తెలుసా ?

TV9 Telugu

25 March 2024

కర్బన రేణువులతో కూడిన పదార్థాన్ని ధూపకర్రలను సుగంధం తాయారు చేయడానికి ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు.

చాలామంది భారతీయులు వారి ఇంట్లో తరుచు అగరుబత్తీలు వేస్తే సుఖశాంతులు, పాజిటివ్ ఎనర్జీ లభిస్తాయని నమ్ముతారు.

సాధారంగా ఇళ్లలో ఉదయం సాయంత్రం అగరుబత్తీలు ఉపయోగిస్తారు. అగరుబత్తీలు వెదురు, రసాయనాలతో తయారు చేస్తారు.

ఆరోగ్యానికి హానికరం అంటున్నారు వైద్య నిపుణులు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించవచ్చని చెబుతున్నారు.

అగరుబత్తీలు కాల్చినప్పుడు కార్బన్ డైయాక్సైడ్ పొగ రూపంలో విడుదలవుతుంది. ఈ పొగ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందట.

పొగ శరీర కణాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అగరబత్తి పొగ ఊపిరితిత్తులకు హానికరంగా మారే ప్రమాదం అంటున్నారు నిపుణులు.

పొగను ఎక్కువ సేపు పీల్చడం వల్ల ఆస్తమా, పక్షవాతం, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా రావచ్చంటున్నారు.

నాణ్యత లేని అగరుబత్తీల నుండి వెలువడే పొగ శరీర కణాలపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది సిగరెట్ పొగ కంటే ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.