కొంప కొల్లేరే.. మామిడి, పుచ్చకాయ, కర్బూజ పండ్లను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..?

29 April 2024

Shaik Madar Saheb

తాజా పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి చాలా తేలికగా జీర్ణమవుతాయి. పలు రోగాల బారి నుంచి మనల్ని కాపాడుతాయి.

కానీ వేసవిలో ప్రజలు కొన్ని పండ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. పండ్లు లేదా కూరగాయలు బయట పాడైపోతాయని వారు భావిస్తారు. 

వాటిని ఫ్రిజ్‌లో ఉంచడం ద్వారా ఎక్కువ కాలం భద్రపరచవచ్చు. కానీ.. కొన్ని మాత్రం ఫ్రిజ్‌లో ఉంచితే విషపూరితంగా మారుతాయి. 

వేసవి కాలంలో ఎక్కువగా ఉపయోగించే మామిడి, పుచ్చకాయ, కర్బూజా పండ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా? వద్దా..? అనేది తెలుసుకోవాలి.

వేసవి కాలంలో ఎక్కువగా తినే పండ్లు మామిడి, పుచ్చకాయ, కర్బూజ పండ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదని నిపుణులు అంటున్నారు. 

వాటిని ఫ్రిజ్ బయట ఉంచడం మంచిది. ఎందుకంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అవి చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల నాణ్యత, రుచి క్షీణిస్తాయి. 

మామిడి, పుచ్చకాయ, కర్బూజ వంటి పండ్లను గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఉంచాలి. దీని వల్ల వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి సమృద్ధిగా అందుతాయి.