ఊపిరితిత్తుల ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు..
06 December 2023
చాలామంది శ్వాస సంబంధిత సమస్యల తొలి సంకేతాలను పట్టించుకోకపోవడం వల్ల రోగం ముదిరిపోతుంది.
తొలిదశలోనే ఊపిరితిత్తుల సమస్యను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా ఐదు లక్షణాలు కనిపిస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరిస్తున్నారు.
మూడు వారాలకు మించి దీర్ఘకాలికంగా దగ్గు ఉన్నట్టయితే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఆస్తమా, దీర్ఘకాలిక బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సూచనగా భావించాల్సి ఉంటుంది.
ఛాతినొప్పి, శ్వాసలో ఇబ్బంది, దగ్గుతున్నప్పుడు రక్తం పడటం ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. శారీరక శ్రమ చేసినప్పుడు శ్వాస తగ్గినట్టు అనిపిస్తే ఊపిరితిత్తుల సమస్యగా భావించాలి.
ఛాతినొప్పి లేదా ఛాతి పట్టేసినట్టు ఉండటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు.
శ్వాస తగ్గడం, తలతిప్పడం లాంటి లక్షణాలతో ఛాతీలో నొప్పి విడువకుండా ఉంటే తక్షణం ఆస్పత్రికి వెళ్లాలి. రక్తం పరిమాణంతో సంబంధం లేకుండా దగ్గుతో రక్తం పడితే నిర్లక్ష్యంగా ఉండకూడదు.
రాజకీయ స్థిరత్వానిబ్రాంకైటిస్, న్యుమోనియా లాంటివి పదేపదే రావడం ఊపిరితిత్తులు డేంజరస్‌లో ఉన్నాయనడానికి సంకేతంగా భావించాలి.కి, స్టాక్ మార్కెట్లకు అవినాభావ సంబంధం