డెంగ్యూ సమయంలో పొరపాటున కూడా వీటిని తినకండి 

28 September 2023

ఈ రోజుల్లో డెంగ్యూ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. డెంగ్యూ అనేది ఆడ దోమ ఏడిస్ ఈజిప్టి కుట్టడం వల్ల వచ్చే ప్రాణాంతక వ్యాధి 

డెంగ్యూ కారణంగా అధిక జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్లలో నొప్పి, రక్త ప్లేట్‌లెట్స్ తగ్గడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. 

ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి.. రోగి తన ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జ్వరంగా ఉన్న సమయంలో  తినాలన్న కోరిక ఉండదు. సరిగ్గా తినలేరు. 

ఈ వ్యాధి సమయంలో డెంగ్యూ రోగులు తినకూడని కొన్ని ఆహారాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇలాంటివి తినడం వల్ల మన ఆరోగ్యం మరింత దెబ్బ తింటుంది.

శ‌రీరం మ‌రింత బ‌ల‌హీన‌ప‌డి ఇంకా ఇన్ఫెక్ష‌న్ అధిక‌మ‌య్యే అవ‌కాశం ఉంటుంది. కెఫిన్. ఇది మన శరీరానికి శక్తిని అందిస్తుంది. కానీ డెంగ్యూ వచ్చినప్పుడు కెఫిన్ పానీయాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదు.

డెంగ్యూ విషయంలో.. శరీరానికి చాలా నీరు అవసరం, కెఫిన్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. అందుచేత కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్, కాఫీ, టీ మొదలైన వాటికి దూరంగా ఉండాలి.

డెంగ్యూ వ్యాధి సోకితే తేలికపాటి ఆహారాన్ని తినాలి. మసాలా ఎక్కువైన ఆహారానికి దూరంగా ఉండాలి. ఇవి కడుపులో మరింత యాసిడ్‌ని ఉత్పత్తి చేయడానికి కారణంగా మారుతాయి.

డెంగ్యూలో రోగులు మాంసాహారం గురించి కూడా మరచిపోకూడదు. డెంగ్యూ సమయంలో జీర్ణక్రియ వ్యవస్థ నెమ్మదిగా పని చేస్తుంది. మాంసాహారం కూడా సులభంగా జీర్ణం కాదు. కాబట్టి రోగులు దీనికి దూరంగా ఉండాలి.

డెంగ్యూ మీ జీర్ణశక్తిని బలహీనపరుస్తుంది. ఫ్యాట్ అధికంగా ఉండే ఆహారాన్ని జీర్ణం చేయడం మీ కడుపుకి కష్టంగా ఉంటుంది. కావున నెయ్యి, నూనె, వెన్న, చీజ్, వేయించిన ఆహార పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలి.

ఈ వ్యాధిలో మీరు వీలైనంత ఎక్కువ నీరు, ద్రవ ఆహారం, కొబ్బరి నీరు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.

ఈ వార్తలో అందించబడిన సూచనలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి, కాబట్టి, ఏదైనా చికిత్స/ఔషధం/ఆహారం అమలు చేసే ముందు, దయచేసి వైద్యుడిని లేదా సంబంధిత నిపుణుడిని సంప్రదించండి