వీటితో సిట్రస్‌ పండ్లను తీసుకుంటే అంతే సంగతులు..

TV9 Telugu

18 February  2024

త‌ర‌హా సిట్ర‌స్ పండ్లు ఆమ్ల‌త్వాన్ని మెండుగా కలిగి కంటాయి. కొన్ని ర‌కాల ఆహార ప‌దార్ధాల‌తో క‌లిపి వీటిని తీసుకోవ‌డం స‌రైంది కాదు.

నిర్ధిష్ట ఆహార ప‌దార్ధాల‌తో క‌లిపి సిట్ర‌స్ ఫ్రూట్స్ తీసుకుంటే గ్యాస్‌, క‌డుపుబ్బరం వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వెంటాడ‌తాయి.

సిట్ర‌స్ పండ్లు శ‌రీరానికి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పూర్తిగా పొందాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

నిర్ధిష్ట ఆహార ప‌దార్ధాల‌ను సిట్రస్‌ పండ్లతో క‌లిపి తీసుకోరాదాని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు.

ఏ ఆహార ప‌దార్ధాల‌తో క‌లిసి సిట్ర‌స్ పండ్ల‌ను తీసుకోరాదో ప‌రిశీలిస్తే.. పాలు, పాల ఉత్ప‌త్తులను సిట్రస్‌ జాతి పండ్లతో అస్సలు తీసుకోరాదు.

అలాగే రెడ్ వైన్‌ కూడా సిట్రస్‌ పండ్లతో పాటు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు.

అధిక ప్రొటీన్‌తో కూడిన ఫుడ్స్‌తో సిట్రస్‌ పండ్లను మిక్స్‌ చేయకూడదాని అంటున్నారు ఆరోగ్య నిపుణులు, వైద్యులు.

బొప్పాయి, పాస్తా, పొటాటో వంటి వాటిని సిట్రస్‌ పండ్లతో కలిపి తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.