చిన్నారులకు యాంటిబయాటిక్స్‌ పని చేయడం లేదా.?

09 September 2024

Battula Prudvi 

చిన్నారుల్లో సాధారణంగా వచ్చే ఇన్‌ఫెక్షన్ల చికిత్సకు వాడే యాంటిబయాటిక్స్‌ సమర్థంగా పనిచేయడం లేదని తాజా అధ్యయనంలో తేలింది.

చిన్నపిల్లల్లో వచ్చే నిమోనియా, సెప్సిస్‌, మెనింజైటిస్‌ వంటి ఇన్‌ఫెక్షన్లపై అవి 50 శాతం కన్నా తక్కువ సమర్థతతో పనిచేస్తున్నాయి.

భారీ స్థాయిలో ఉత్పన్నమవుతున్న యాంటీబయాటిక్‌ నిరోధకతే ఇందుకు కారణమని అధ్యయనంలో గుర్తించారు ఆరోగ్య నిపుణులు.

ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరంలో ఉన్న సిడ్నీ విశ్వవిద్యాలయనికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

మానవాళికి పెను ఆరోగ్య ముప్పుగా పరిణమించిన 10 అంశాల్లో ఏఎంఆర్‌ ఒకటని డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే హెచ్చరించింది.

ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 లక్షల మంది పిల్లలు సెప్సిస్‌ బారినపడుతున్నారు. వారిలో 5.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

మొండి బ్యాక్టీరియాకు చికిత్స చేయడానికి సమర్థ యాంటీబయాటిక్స్‌ లభించకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణం అంటున్నారు.

తాజాగా ఈ పరిశోధన సంబంధించిన వివరాలు అన్ని ప్రముఖ వైద్య పత్రికగా పేరు ఉన్న ‘ద లాన్సెట్‌’లో ప్రచురితమయ్యాయి.