02 November 2023
ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నారా? అయితే మీకు ఆ ముప్పు ఉంది జాగ్రత్త!
కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగిపోయింది. కార్యాలయాలకు వెళ్లకుండానే ఇళ్ల నుంచే అన్ని పనులు చక్కబెట్టేస్తున్నారు.
ఇళ్లయినా, ఆఫీసయినా ఎక్కువ సేపు ఒకే దగ్గర కూర్చుని పని చేయడం వలన పలు ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
రోజుకు 9 -10 గంటలపాటు ఒకేచోట కూర్చుని పనే చేసేవారు స్థూలకాయం, గుండెజబ్బుల బారిన పడుతున్నారని వెళ్లడైంది.
మరికొంత మందికి గుండెజబ్బులతో పాటు పలు రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోజుకు 8 గంటలపాటు కూర్చునేవారి కన్నా రోజుకు 12 గంటలపాటు కూర్చుని పని చేసేవారికి సమస్యలు ఎక్కువ అంటున్నారు.
రోజుకు 12 గంటల పాటు కూర్చుని పని చేస్తూ వ్యాయామం చేయని వారు మరణించే అవకాశం 38% ఎక్కువగా ఉంటుందని ఓ అధ్యయన నివేదిక వెల్లడించింది.
50 ఏళ్లకుపైబడిన వారి మీద అధ్యయనకారులు పలు రకాలు పరిశోధనలు చేశారు. 22 నిమిషాలపాటు వ్యాయామం చేయలేనివారు దశలవారీగా చేసినా ఫలితం ఉంటుందట.
రోజుకు కనీసం 22నిమిషాలు వ్యాయామం చేస్తే అల్పాయుష్షుతో మరణించే అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉందని పరిశోధకులంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి