28 September 2023
సీజనల్ వ్యాధుల్లో ఒకటి డెంగ్యూ ప్రస్తుతం విజృంభిస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. డెంగ్యూ మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది
వైద్యుల ప్రకారం, డెంగ్యూ రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ లక్షణానికే మొదటి ప్రాధాన్యత. అయితే ఇప్పుడు గుండె, కిడ్నీ, మెదడు, కాలేయం, క్లోమం ఇలా అనేక అవయవాలు డెంగ్యూ బారిన పడుతున్నాయి
పెద్దవారిలో డెంగ్యూ లక్షణాలను గుర్తించి సకాలంలో చర్యలు తీసుకోవడం సాధ్యపడుతుంది. అయితే తల్లిదండ్రులు పిల్లల పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి.
డెంగ్యూ లక్షణాలను సకాలంలో గుర్తించాలి. జ్వరం, తలనొప్పి, వాంతులు, చర్మంపై దద్దుర్లు డెంగ్యూకి సంబధించిన సాధారణ లక్షణాలు
డెంగ్యూ దోమల నుండి పిల్లలను రక్షించడానికి ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. అవసరమైతే కిటికీలకు దోమలు రాకుండా మ్యాట్ ఏర్పాటు చేసుకోవాలి
పిల్లలని స్కూల్ కు పంపే సమయంలో ఫుల్ హ్యాండ్స్ ఉన్న యూనిఫాం వేయాలి. ఇంటి లోపల , బయట కూడా ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్, ప్యాంటు వెయ్యాలి. ఇది డెంగ్యూ దోమల నుండి పిల్లలను రక్షించగలదు.
రాత్రిపూట దోమతెర వేసుకుని నిద్రపోయేలా చూడాలి. ఇలా చేయడం వలన పిల్లలు డెంగ్యూ బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు. ఇంట్లో దోమల నివారణ కోసం ధూపం కూడా వేయవచ్చు.
మైదానంలో దోమలు ఎక్కువగా ఉంటే పిల్లల్ని ఆడుకోవడానికి బయటికి పంపకండి. పిల్లవాడిని ఇంట్లో ఆడుకోనివ్వండి. బయటికి వెళితే దోమల నివారణ క్రీమ్ రాయాలి.