ఈ పండ్ల రసాలతో అధిక బరువు సమస్య దూరం.. 

TV9 Telugu

02 February 2024

బ‌రువు త‌గ్గే క్ర‌మంలో జీవ‌క్రియ‌ల వేగం పుంజుకోవ‌డం ఎంతో కీల‌కం అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు.

బ‌రువు త‌గ్గించుకునేందుకు కొన్ని రకాల పానీయాలు శ‌రీరానికి ప‌లు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌నూ అందిస్తాయంటున్నారు.

ఓ అయిదు ర‌కాల ఫ్రూట్ జ్యూస్ అత్యంత రుచిక‌రంగా ఉండ‌టంతో పాటు బరువు త‌గ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉండే దానిమ్మ జ్యూస్ బ‌రువు త‌గ్గేందుకు సాయపడుతుంది. అద్భుత‌మైన వెయిట్ లాస్ దీన్ని ఆప్ష‌న్‌గా ఎంచుకోవచ్చు.

పాలీపెనాల్స్‌, ఆంథోసియానిన్స్ అధికంగా ఉండే ఈ జ్యూస్‌తో జీవ‌క్రియ‌ల వేగం పెరిగి బ‌రువు అదుపులో ఉంటుంది.

ప‌లు వ్యాధులు ద‌రిచేర‌కుండా నిరోధించే దానిమ్మ జ్యూస్‌ను ఇత‌ర ఫ్రూట్‌, వెజిట‌బుల్ జ్యూస్‌ల‌తో క‌లిపి తీసుకోవ‌చ్చు.

మెట‌బాలిజాన్ని ప‌రుగులు పెట్టించి బ‌రువు త‌గ్గేందుకు స‌హ‌క‌రించే బ్లూబెర్రీ జ్యూస్ బరువు తగ్గడంలో మేలు చేస్తుంది.

బ్లూబెర్రీస్‌లో పొటాషియం, మాంగ‌నీస్ శ‌రీరంలో కొవ్వుల‌ను క‌రిగిస్తాయి. క్రాన్‌బెర్రీ జ్యూస్‌, టార్ట్ చెర్రీ జ్యూస్‌, యాపిల్ జ్యూస్‌ వెయిట్ లాస్‌కు మంచి ఎంపిక.