మళ్లీ జడలు విప్పుతున్న కరోనా..! ఈ రెండు లక్షణాలపై జాగ్తత్త..!

TV9 Telugu

06 January 2024

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అంత అతలాకుతలం అయిపొయింది. దీని కారణంగా ప్రపంచం అంత గృహ నిర్బంధంలోకి వెళ్ళిపోయింది.

దీనివాల్ల ఎంతోమంది తమ ఆత్మీయులను కోల్పోయారు. ఇప్పుడు కరోనా రూపుమార్చుకొని జేఎన్‌.1 వేరియంట్‌ గా విజృంభిస్తుంది.

జేఎన్‌.1 వేరియంట్‌ చాలా సందర్భాల్లో తేలికపాటి లక్షణాలు ఉన్నప్పటికీ.. ప్రమాదం 10 శాతం కంటే తక్కువగానే ఉంటుంది.

కొత్త వేరియంట్‌ ఇన్ఫెక్షన్‌ రేటు అధికంగా ఉన్నా.. తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా లేదని యూకే ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.

ఇన్ఫెక్షన్‌ వేగంగా విస్తరిస్తే.. సరైన సమయంలో నియంత్రించకపోతే రాబోయే నెలల్లో కొత్త వేరియంట్‌ పుట్టుకువచ్చే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

వైరస్‌ స్పైక్‌ ప్రోటీన్‌లో అదనపు మ్యుటేషన్‌ కలిగి ఉందని, జేఎన్‌1 వేరియంట్‌ అధిక ట్రాన్స్‌మిసిబిలిటీని కలిగి ఉంటుందని నిపుణులు తెలిపారు.

అందరూ మాస్క్‌లు ధరించాలని, తరచుగా చేతులు కడుక్కోవాలని.. వైరస్‌ సోకుండా ఉండేందుకు సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా జేఎన్‌.1 వేరియంట్‌ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు వైద్యులు ఆరోగ్య నిపుణులు.