వాల్‌నట్స్ మన శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గుండెకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
రాత్రిపూట 4 లేదా 5 వాల్‌నట్‌లను నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఒక కప్పు పెరుగుతో కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల దానిలో పోషకాల పరిమాణం మరింత పెరుగుతుంది.
సాయంత్రం ఆకలిని తీర్చడానికి ఫాస్ట్ ఫుడ్స్ బదులుగా, కొన్ని వాల్‌నట్స్‌లను తీసుకుంటే ఎన్నో పోషకాలు అందుతాయి. వాల్‌నట్స్‌లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
స్మూతీలకు ఆరోగ్యకరమైన అదనపు పోషకాలు ఇవ్వడానికి మీరు రోజువారీ పానీయంతో వాల్‌నట్‌లను ఉపయోగించవచ్చు. మీరు దీనిని అల్పాహారంలోనూ తీసుకోవచ్చు.
సలాడ్ తినాలనుకుంటే, దానికి కొన్ని వాల్‌నట్ ముక్కలను జోడిస్తే పోషకాలను పెంచడానికి పనిచేస్తుంది. వీటిని డిప్స్, సాస్‌లలో కూడా ఉపయోగించవచ్చు.
వాల్‌నట్‌లను గ్రైండ్ చేసి చేపలు, చికెన్‌పై పూతలా రాసి ప్రే చేసుకోవచ్చు. ఇది రుచిని పెంచడమే కాకుండా పోషక విలువలను కూడా పెంచుతుంది.
యాంటీఆక్సిడెంట్లు – వాల్‌నట్స్‌లో విటమిన్ ఇ, మెలటోనిన్, మొక్కల సమ్మేళనం ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు- వాల్‌నట్‌లో ఇతర గింజల కంటే ఎక్కువ ఒమేగా -3 ఉంటుంది. ఇది గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడుతుంది.