సంతోషాన్ని పెంచి ఒత్తిడిని తగ్గించే చిన్న పండు.. 

TV9 Telugu

17 August 2024

పాన్ షాపుల్లో స్వీట్​పాన్‌కి టూత్ పిక్.. దానికి ఓ ఎర్రని పండును గుచ్చి ఇస్తుంటారు. తియ్యని రుచి కలిగిన ఆ పండ్లు చెర్రీస్ అనుకుంటాం కానీ అవి వాక్కాయలు.

ఈ పండ్లను ఎండబెట్టి టూటీ ఫ్రూటీగా తయారు చేయడంతో పాటు కేకులు, సలాడ్ల అలంకరణ చేసేది సహజసిద్ధంగా దొరికే కలిమె పండ్లతోనే.

వాక్కాయల తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మీ ఆహారంలో చేర్చుకుంటే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

వాక్కాయలనే కొన్ని ప్రాంతాల్లో కరిమె పండ్లు అని కూడా పిలుస్తారు. వాక్కాయలు విటమిన్‌ బి, సి, ఐరన్‌ రోగనిరోధకశక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

ఇందులోని పీచు పదార్థం కడుపు ఉబ్బరాన్ని అడ్డుకుని అజీర్తి సమస్యను తగ్గిస్తుంది. పెక్టిన్‌ అనే కార్బోహైడ్రేట్‌ జీర్ణవ్యవస్థను మెరుగు పరిచి ఆకలిని పెంచుతుంది.

విటమిన్స్‌తో పాటు ట్రిప్ట్టొఫాన్‌ అనే అమైనో యాసిడ్‌.. సెరటోనిన్‌ను ఉత్పత్తి చేయడం వల్ల అవి ఒత్తిడిని తగ్గించి మెదడును చురుగ్గా ఉంచుతాయి.

ఫైబర్, విటమిన్ సి అధిక మోతాదులో లభించే కలిమె పండ్లలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఎక్కువే. మధుమేహాన్ని కూడా నివారిస్తుంది.

ఆస్తమా, చర్మవ్యాధి బాధితులకు ఎంతో మేలుచేస్తుంది. మూత్ర నాళాన్ని శుభ్రపరచడంతో పాటు కిడ్నీలో రాళ్లు కరిగిపోయేలా సహకరిస్తుందని నిపుణులు అంటున్నారు.