వేరుశెనగలు ఎక్కువగా తింటున్నారా.. ప్రమాదం మీ చెంతనే..
TV9 Telugu
14 August 2024
వేరుశెనగలో ఉన్న మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీని కారణంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది.
వేరుశెనగలో పుష్కలంగా ఉన్న మంచి కొవ్వులు శరీరంలో మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కానీ మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
వేరుశెనగ తీసుకోవడం వల్ల తగ్గుతుంది. అయితే వీటిని ఎక్కవ తీసుకుంటే మాత్రం నష్టాలు తప్పవు అంటున్నారు నిపుణులు.
హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవారు వేరుశెనగలు తింటే హాని కలుగుతుంది. దీని వల్ల TSH స్థాయి పెరిగి సమస్యను మరింత జటిలం చేస్తుంది.
కాలేయ సమస్య ఉన్నవారు మీరు వేరుశెనగలకు దూరంగా ఉండాలి. దీనిలోని పదార్థాలు కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
వేరుశెనగను అధిక వినియోగం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీని కారణంగా అజీర్ణం సమస్య ఏర్పడుతుంది.
అలెర్జీ సమస్యలు ఉన్నవారు వేరుశెనగ తినకూడదు. దీని తింటే చర్మంపై దురద, శ్వాస సమస్య వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వేరుశెనగలో అధిక కొవ్వు కారణంగా శరీర బరువు పెరుగుతుంది. అందుకే వేరుశెనగను పరిమితిలో మాత్రమే తీసుకోవాలి. అధికంగా తినకూడదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి