చిలగడ దుంపల తింటే ఈ నొప్పులన్నీ దూరం..
TV9 Telugu
08 October 2024
చిలగడ దుంపలలో ఫైబర్, విటమిన్లు ఏ, సీ, బీ6, పొటాషియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా ఉంటాయి.
చిలగడ దుంపలలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోకి చేరిన తర్వాత విటమిన్ ఏగా మారుతుంది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది.
ఇందులో అధిక ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరిచి.. ఆకలితో పాటు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు.
షుగర్ పేషంట్స్ కూడా వీటిని తినవచ్చు. తియ్యగా ఉన్నా.. వీటిలో షుగర్ ను కంట్రోల్ చేసే సమ్మేళనాలు ఉంటాయి.
వీటిలో పొటాషియం హై బీపీని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు వాపులు, నొప్పులను తగ్గిస్తాయి.
ముఖ్యంగా చిలగడ దుంపలు కొన్ని రకాల కాన్సర్ల నుండి మనలని రక్షించడంలో సహాయపడతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అలాగే ఇవి మూత్రాశయం, పెద్ద ప్రేగు, కడుపు, రొమ్ములో పెరిగే కాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది
చిలకడ దుంపను తినడం వల్ల మెదడు పని తీరు మెరుగుపడుతుంది. ఇది మంటను తగ్గించి ఫ్రీ రాడికల్ డామేజ్ ను తగ్గిస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి