బొప్పాయితో ఆ సమస్యలన్నీ ఖతం.. 

27 September 2024

TV9 Telugu 

తరుచు రుచికరమైన బొప్పాయి పండుతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ పండులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.

ఇది శరీరంలో విటమిన్ Aను తయారు చేయడానికి సహకరిస్తుంది. మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ ఎ తీసుకోవాలి.

బొప్పాయి పండులో అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా, మలబద్ధకం సమస్యలకు అడ్డుకట్ట వేస్తుంది. తద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండే రసాయనాలు, ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

బొప్పాయిలోని ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

బొప్పాయి తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగిన ఆహారం. ఇది అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బరువు తగ్గడంలో బాగా సహాయపడుతుంది.

బొప్పాయిలో ఉండే ఎంజైమ్‌లలో ఒకటైన పాపైన్, జీర్ణక్రియకు సహాయపడటానికి అవసరమైన ప్రోటీన్‌లను అందిస్తుంది.

కడుపు, కాలేయ సమస్యలు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మంపై ముడతను తగ్గిస్తాయి.