పచ్చి టమాటాలు ఆ సమస్యలకు యమపాశం.. 

TV9 Telugu

14 October 2024

పచ్చి టమాటాలో విటమిన్లు, మినరల్స్, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.

వీటిలోని ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నందున స్త్రీలకు గర్భధారణ సమయంలో శిశువు ఎదుగుదలతో పాటు నరాల పెరుగుదలను ప్రేరేపిస్తుంది.

మీ ఎముకలు బలహీనంగా ఉన్న, నిరంతరం ఒళ్లు నొప్పులు వేధిస్తున్న పచ్చి టమోటాలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

గ్రీన్ టమాటాలో విటమిన్లు పుష్కలంగా ఉన్న కారణంగా ఎముకలను బలపరిచి సాంద్రతను పెంచుతాయని అంటున్నారు నిపుణులు.

గ్రీన్ తమటలో తక్కువ చక్కర ఉన్న కారణంగా వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

పచ్చి టమాటాల్లో సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటుంది. దీంతో ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

పచ్చి టమోటాలు చర్మానికి వరం. వీటిలోని విటమిన్-సి వృద్ధాప్యాన్ని నెమ్మదించి చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతుంది.