కరివేపాకులో పోషకాలు తెలిస్తే షాక్.. 

TV9 Telugu

01 August 2024

కరివేపాకులో కేవలం రుచి మాత్రమే కాదు.. పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.

కరివేపాకు కండ్లు, జుట్టుకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలను నివారించడంలో దివ్య ఔషధంగా పని చేస్తుంది.

ఆహారంతో పాటు తీసుకున్నా, నీటిలో నానబెట్టి తాగినా, హాట్ వాటర్ తో కలుపుకుని తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది.

కరివేపాకు నానబెట్టిన నీటిని ఉదయం లేవగానే తాగితే చెడు కొలెస్ట్రాల్ వేగంగా తగ్గిపోతుందని చెబుతున్నారు.

కాలేయం సమస్యలు ఉన్నవారు కరివేపాకును ఆహారంతో కలుపుకుని తిన్నా, నీటితో కలిపి తాగినా మంచి ఫలితం ఉంటుంది.

ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాలేయాన్ని కాపాడేందుకు కరివేపాకు సాయపడుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

కరివేపాకు తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా మెరుగవుతుంది. కరివేపాకు నీరు తాగిన తర్వాత జీవక్రియ సాఫీగా సాగుతుంది. మలబద్దకం దూరం అవుతుంది.

కరివేపాకు తినడం, తాగడం మూలంగా జట్టు మందంగా, నల్లగా, బలంగా తయారవుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.