లవంగలు ఉండగా అండగా.. ఆరోగ్యంపై చింతెందుకు దండగ..
TV9 Telugu
29 August 2024
లవంగలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.లవంగాల్ని కూరలతోపాట కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల్లో కూడా ఎక్కువగా వాడతారు.
లవంగాలను తినడం వల్ల పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. లవంగం నూనెని పంటి నొప్పికి మందుగా వాడతారు.
దంత సమస్యలు, చిగుళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు లవంగాలను పొడిగా చేసి ఉపయోగిస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
లవంగాలు నోటి నుంచి ఎక్కువగా దుర్వాసన వస్తే.. రెండు మూడు లవంగాలు నమిలితే చాలు.. ఆ దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు.
కొందరికి దూర ప్రయాణాలు చేయడం పడదు. ప్రయాణాల్లో మధ్యలోనే వాంతులు చేసుకుంటుంటారు. అలాంటి వారి సమస్యను కూడా లవంగాలతో చెక్ పెట్టొచ్చు.
ఇక వర్షంలో తడిసినా, చల్లని పదార్థాలు, స్వీట్లు తీసుకున్నా చాలా మందికి వెంటనే జలుబు, దగ్గు పట్టేస్తుంది. ఇలాంటి సమయంలో అయిదు లవంగాలను తీసుకుపోవాలి.
రెగ్యులర్‌గా తలనొప్పి వచ్చేవారు.. లవంగాలను తినడం ద్వారా రిలీఫ్ పొందవచ్చు. అంతేకాదు ఇది బీపీని, షుగర్ లెవల్స్‌ను కూడా కంట్రోల్‌లో ఉంచుతాయి.
లవంగాల్లో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. ఇది నొప్పి, వాపు, మంటల్ని తగ్గిస్తుంది. అల్సర్ సమస్యలకు కూడా లవంగాలతో ఉపశమనం పొందవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి