చెర్రీస్‌తో ఆ సమస్యలకి చరమగీతం.. 

TV9 Telugu

12 July 2024

చెర్రీస్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు కండరాల నొప్పి, వాపు నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.

చెర్రీ పండ్లు ఫైబర్‌కు మంచి మూలం. దీని కారణంగా మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

చెర్రీ ఉత్పత్తులు వ్యాయామ పనితీరును మెరుగుపరుస్తాయని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు.

చెర్రీలు సాధారణ హృదయ స్పందన రేటును నిర్వహించడానికి, మీ శరీరం నుంచి అదనపు సోడియంను తొలగించడంలో సహాయపడతాయి.

చెర్రీస్‌ను తీసుకోవడం వల్ల మీ రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయని అంటున్నారు పోషకాహార నిపుణులు.

చెర్రీస్‌లోని ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కారణంగా ఆర్థరైటిస్‌ సమస్యతో బాధపడేవారికి మేలు చేస్తాయి.

చెర్రీస్ తినడం వల్ల మెలటోనిన్ పుష్కలంగా ఉండటం వల్ల మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుయని అంటున్నారు వైద్యులు.

మహిళలు గర్భధారణ సమయంలో చెర్రీస్ తరుచు తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు కూడా దరిచేరవు.