తమలపాకుతో ఆ సమస్యలన్నీ మటుమాయం.. 

TV9 Telugu

10 October 2024

తమలపాకులో ఎన్నో ఆరోగ్య లక్షణాలున్నాయి. తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు నిండుగా ఉన్నాయి.

హిందువులు ఎదైనా పూజలు చేసినప్పుడు కచ్చితంగా ఉపయోగించే తమలపాకులు నమిలితే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

తాంబూలం రూపంలో తీసుకోవడం కంటే.. తమలపాకులను వేసి మరిగించిన నీటిని తాగడం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

గ్లాసు నీటిలో ఒక తమలపాకు ముక్కలు చేసి వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి. దీనివల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది.

పేగు కదలికలు జరిగేలా చేస్తుంది. శరీరంలో వాపును తగ్గిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది.

జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. మధుమేహం నియంత్రణలో కూడా తమలపాకు నీరు తోడ్పడుతుంది.

చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను కూడా తమలపాకు నీరు నియంత్రిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ఆస్తమాను ఊపిరితిత్తుల వ్యాధులను అదుపులో ఉంచుతుంది.