ఈ కాంబినేషన్ ఫుడ్స్ తో మీ ఆరోగ్యం భద్రం..
TV9 Telugu
11 February 2024
మన దగ్గర దొరికే కొన్ని ఆహార పదార్ధాల కలయికతో అవి సూపర్ ఫుడ్స్‌గా మారతాయని పోషకాహార నిపుణులంటున్నారు.
అదనంగా జోడించే పదార్ధాలు వాటి రుచిని పెంచడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తాయని చెబుతున్నారు.
ఇలా ప్రయత్నించడం ద్వారా సాధారణ ఆహార పదార్ధాలను సూపర్ ఫుడ్స్‌గా మార్చేయవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
బ్రేక్‌ఫాస్ట్‌గా పలువురు తీసుకునే పోహ తేలికపాటి ఆహారంగా అందరూ ఇష్టపడుతుంటారు. పోహాలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
పోహలో కొద్దిగా నిమ్మరసం జోడించి తీసుకుంటే ఇందులో ఉండే విటమిన్ సీ.. శరీరం ఐరన్‌ను మెరుగ్గా సంగ్రహించేలా చేస్తుంది.
అలాగే యోగర్ట్ లో నట్స్ జోడించడం వల్ల అది సూపర్ ఫుడ్ గా మారుతుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
గ్రీన్ టీలో లెమన్ వాడటం వల్ల ఆరోగ్యం ప్రయోజనాలు రెట్టింపవుతాయని సూచిస్తున్నారు నిపుణులు, వైద్యులు.
పసుపు, మిరియాల జోడి... అలాగే దాల్, చావల్ కలయిక మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుందన్నది వైద్యుల మాట.
ఇక్కడ క్లిక్ చెయ్యండి