రాజ్మా తో ఈ అనారోగ్య సమస్యలకు చెక్..
TV9 Telugu
25 August 2024
రాజ్మా చాలా మంది ఎంతో ఇష్టంగా తినే ఆహారం. దీనిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది సరిగ్గా కిడ్నీ ఆకారాన్ని కలిగి ఉంటుంది.
రాజ్మాలో అధిక మొత్తంలో ఐరన్, మెగ్నీషియం, కార్బోహైడ్రెట్, పొటాషియం, పాస్పరస్, ఫైబర్, సోడియం, కాపర్, ఫోలేట్, కాల్షియం మొదలైనవి ఉంటాయి.
ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో ఇది బరువు తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
రాజ్మాను రెగ్యూలర్ గా తినడం వలన కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే మలబద్ధక సమస్య కూడా తగ్గుతుంది.
దీనిలో కాల్షియం ఉండడం వలన ఎముకలను బలంగా చేస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరం బయోయాక్టివ్ సమ్మేళనాలను అందిస్తుంది.
దీనిని రోజూ తినడం వలన క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.
రాజ్మా శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని అందించడమే కాకుండా.. ప్రోటీన్ కణాలను నిర్మిస్తుంది.
శరీరానికి శక్తిని అందించడానికి రెగ్యూలర్గా రాజ్మా తీసుకోవాలి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలిక్ యాసిడ్, జింక్, ఐరన్ పుష్కలంగా ఉండడం వలన బలంగా ఉంటారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి