పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం తినండి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు, వ్యాధులకూ చెక్ పెట్టినవారవుతారు.
ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తోంది. మీరూ భాగం కండి పోషకాల గురించి తెలుసుకోండి.
పోషకాహారం తీసుకోవడంతో పాటు శారీరక వ్యాయామం కూడా చేయండి. దీని ద్వారా మెరుగైన ఆరోగ్యం సొంతం అవుతుంది.
మన జీవక్రియ సరిగ్గా సాగాలంటే పోషకాలు, విటమిన్లు, మినరల్స్ శరీరానికి అవసరం. రోగ నిరోధక వ్యవస్ధ పుంజుకుని గుండె ఆరోగ్యం, జీర్ణవ్యవస్ధ మెరుగువుతుంది.
పోషకాహారంతో బరువు పెరిగే సమస్యే ఉండదు, మెదడు చురుగ్గా పని చేస్తుంది, ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి.