ఈ చిట్కాలతో చాలాకాలంలో వేదించే చుండ్రు సమస్యకు చెక్..
TV9 Telugu
17 January 2024
చుండ్రు సమస్యను వీలైనంత తొందరగా వదిలించుకుంటే మంచిదని అందరూ భావిస్తుంటారు. ఇది రావడానికి ప్రత్యేకంగా ఒకటే కారణం ఉంటుందని చెప్పలేం.
వాతావరణ మార్పులు, షాంపూలు, కొవ్వు పదార్థాలు మితిమీరి తినడం, అధిక చెమట, కాలుష్యం వల్ల చుండ్రు వస్తుంది.
ఏ కారణంతో చుండ్రు వచ్చినప్పటికీ.. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా వాటిని దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
హెయిర్ డ్రయర్‌ను ఉపయోగించడం వల్ల మాడుకు నేరుగా వేడి తగిలి చుండ్రు తీవ్రత పెరుగుతుందని చెబుతున్నారు.
పొడి టవల్‌తో తుడుచుకుంటూ జుట్టును ఆరబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-బి, జింక్ పదార్థాలు బాగా తీసుకోవాలి.
పండ్లు, పచ్చి కూరగాయల సలాడ్లు రోజువారీ భోజనంలో చేర్చుకోవాలి. గుడ్లు, చేపలు, అరటిపండ్లు, పాలకూర వంటి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి.
మాడులో రక్త ప్రసరణ బాగా జరగాలంటే తరచూ జుట్టును దువ్వుతూ ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు వైద్యులు.
దానివల్ల జుట్టు మాడులో నూనెలు ఉత్పత్తి అవుతాయి. చుండ్రు తగ్గుతుందని అంటున్నారు వైద్యారోగ్య నిపుణులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి