రోజు రెండు స్ట్రాబెర్రీలతో ఆ సమస్యలకు చెక్..
TV9 Telugu
14 October 2024
స్ట్రాబెర్రీ కొంచెం ఖరీదైనప్పటికీ దీన్ని తరచు తీసుకోవడం వల్ల అనేక సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
స్ట్రాబెర్రీ వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా నిరోధిస్తుంది. ఇది తీసుకుంటే ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
స్ట్రాబెర్రీలో చక్కెర శాతం తక్కువగా ఉన్న కారణంగా దీన్ని మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా హాయిగా తినొచ్చు.
స్ట్రాబెర్రీ ఆల్జీమర్స్, మతిమరుపు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. జ్ఞాపక శక్తి పెరగటానికి దోహదం చేస్తుంది.
స్ట్రాబెర్రీ పండులో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున దీని తింటే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
స్ట్రాబెర్రీలోని విటమిన్లు క్యాన్సర్ వ్యాదిని నివారించడంలో సహాయపడతాయి. దీనిలోని పీచు పదార్థం బరువును అదుపులో ఉంచుతుంది.
స్ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తింటే రక్తపోటు, గుండె ఆరోగ్యం, స్ట్రోక్లను నివారిస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఇది ఉత్తమమైన పండు.
ఇప్పటి నుంచి రోజు రెండు స్ట్రాబెర్రీలు తినండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటున్నారు పోషకాహార నిపుణులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి