గ్రీన్ కాఫీతో డయాబెటిస్‌కు చెక్.. అసలు గ్రీన్ కాఫీ అంటే ఏంటి? ఎలా తయారుచేస్తారు?
17 October 2023
గ్రీన్‌టీలా గ్రీన్ కాఫీ తీసుకుంటే శరీర బరువు తగ్గి, మధుమేహం అదుపులో ఉంటుందని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఆచార్యులు చెబుతున్నారు.
సాధారణంగా కాఫీ పొడిని తయారు చేసేందుకు కాఫీ గింజలను కాలుస్తారు. వీటిని తర్వాత వేయించి రోస్ట్ చేస్తారు.
ఇలా చేయకుండా నేరుగా గింజల ద్వారా కాఫీని తయారు చేసేందుకు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేయనున్నారు.
సాధారణ కాఫీతో పోలిస్తే గ్రీన్ కాఫీ రుచి వేరుగా ఉంటుంది. ఇది హెర్బ్ లేదా మూలికల మాదిరిగా రుచి కలిగి ఉంటుంది.
గ్రీన్ కాఫీలో కాల్చిన కాఫీ గింజల కంటే ఎక్కువ స్థాయిలో క్లోరోజెనిక్ ఆమ్లం ఇంకా తక్కువ కెఫిన్ ఉంటుంది.
గ్రీన్ కాఫీని రోజుకు ఒకసారి తాగినా క్లోరోజెనిక్ ఆమ్లం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. కొవ్వును కరిగించి జీవక్రియను పెంచుతుంది.
హృదయ స్పందనను నిలకడగా ఉంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తనాళాలను విస్తరిస్తుంది కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
గ్రీన్ కాఫీ తాగితే ఎన్ని ప్రయాజనాలు ఉన్నాయో తెలుసుకున్నారుగా.. వెంటి ఈ కాఫీని మీ డైట్ లో చేర్చుకోండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి