ఈ డైట్‌తో అధిక బరువు సమస్యకు చెక్..

TV9 Telugu

17 January 2024

ప్రస్తుత కాలంలో అనేక మంది వయసుతో సంబంధం లేకుండా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారని అందరికి తెలిసిన విషయమే.

ఊబకాయాన్ని వదిలించుకునేందుకు అనేక రకాల డైట్‌ ప్లాన్‌లు ఆచరిస్తుంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు ‘మార్నింగ్‌ బనానా డైట్‌’ట్రై చెయ్యండి.

ఉదయం పూట అల్పాహారానికి బదులు అరటిపళ్లు మాత్రమే తినడమే ఈ డైట్‌ స్పెషాలిటీ అంటున్నారు పోషికాహార నిపుణులు.

ఈ మార్నింగ్‌ బనానా డైట్‌ను జపాన్‌ దేశానికి చెందిన సుమికో అనే ఓక వైద్యారోగ్య నిపుణురాలు రూపొందించారు.

ఉదయం పూట కడుపు కాస్త నిండుగా అనిపించేంత వరకు అరటిపండ్లు ఆరగించాలి. డైట్‌లో భాగంగా రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఏమీ తినకపోవడం మేలు.

ఈ డైట్‌లో భాగంగా పాల పదార్థాలు, మిఠాయిలు, కెఫిన్‌, మద్యానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

ప్రతిరోజూ తాజా పండ్లు, కూరగాయలు, సిరి ధాన్యాలను మీ ఆహారంలో చేర్చుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అయితే మార్నింగ్ బనానా డైట్‌ ప్రారంభించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.