ప్రపంచంలోని అతి చిన్న డైనోసార్‌ సైజ్ ఎదో తెలుసా?

TV9 Telugu

30 October 2024

అజీర్తి ప్రస్తుతరోజుల్లో చాలామందిలో ఉన్న సమస్య. దీనికి కొన్ని వంటింటి చిట్కాలతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు.

యాలకులు నోట్లో వేసుకుని నమిలితే ఎసిడిటీ, అజీర్తి, గ్యాస్‌, గుండెలో మంట, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

జీలకర్ర జీర్ణ సంబంధ సమస్యలకు చక్కటి పరిష్కారం. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరమయ్యే ఎంజైమ్‌ల ఉత్పత్తికి సహాయపడుతుంది.

యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలున్న వాము గ్యాస్ట్రిక్‌ సమస్యలను, అజీర్తిని ఆమడ దూరంలో ఉంచుతుంది. వాముతో టీ వల్ల జీర్ణక్రియ పని తీరు మెరుగవుతుంది.

మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున పావుస్పూను ఇంగువని గ్లాసు నీటిలో కలుపుకొని తాగితే నయమవుతుంది.

అల్లం కడుపుబ్బరం, తేన్పులను తక్షణమే తగ్గిస్తుంది. అల్లాన్ని నేరుగా తీసుకోలేని వారు అల్లం టీ చేసుకున్నా మంచి ఫలితముంటుంది.

పెరుగును ఆహారంలో భాగం చేసుకుంటే కడుపుబ్బరం సమస్యలను దూరం చేసే బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడంలో పెరుగు సమర్థంగా పనిచేస్తుంది.

పుదీనా ఆకులను నమలడం వల్ల జీర్ణాశయంలో పైత్యరసం అధికంగా ఉత్పత్తి అయి, కడుపు ఉబ్బరం తగ్గి ఆహాకం సులభంగా జీర్ణమవుతుంది.