పసుపుతో జీర్ణకోశ సమస్యలకు చెక్..

16 October 2023

జీర్ణకోశ సమస్యలతో బాధపడే వారికి పసుపులో ఉండే కర్‌క్యుమిన్‌ ఎంతో మేలు చేస్తుందని గుర్తించారు. సాధారణంగా కడుపులో ఆమ్లం పేరుకుపోవడం వల్ల అజీర్తి సమస్యలు తలెత్తుతాయి.

అయితే కడుపులో ఆమ్లం తగ్గటానికి వాడే ఒమిప్రజోల్‌ మందుతో సమానంగా పసుపు పని చేస్తుందని పరిశోధనలో గుర్తించారు.

పసుపులోని కర్‌క్యుమిన్‌కు వాపును తగ్గించే లక్షణాలు, సూక్ష్మక్రిములను కట్టడి చేసే సామర్థ్యం పుష్కలంగా ఉంది.

అందుకే పసుపును గాయాలు తగ్గటానికి కూడా వాడుతుంటారు. పసుపు ఉపయోగించడం కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

అయితే సంప్రదాయ మందులతో పోలిస్తే పసుపు జీర్ణకోశ సమస్యల విషయంలో పనితీరు ఎంత మెరుగు అనేది మాత్రం గుర్తించాల్సి ఉంది.

జీర్ణక్రియ సమస్యలపై పసుపు ఎంత సమర్థవంతంగా పని చేస్తుందో తెలుసుకోవడానికి థాయ్‌లాండ్‌లో అధ్యయనం చేశారు.

అజీర్ణం సమస్యలతో బాధపడుతున్న వారిలో కొందరికి కర్‌క్యుమిన్‌, మరికొందరికి ఒమిప్రజోల్‌ మాత్రలు ఇచ్చారు.

మరికొందరికి మాత్రం రెండూ కలిపి ఇచ్చి చూశారు. అందరిలోనూ నొప్పి, కడుపుబ్బరం వంటి లక్షణాలు తగ్గిపోయాయి.