వెల్లుల్లితో పొట్టలో కొవ్వు సమస్యకి చెక్..

09 November 2023

మన వంటింటిలో దొరికే ఆహార పదార్థాలతోనే పొట్టలోని కొవ్వును కరిగించుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

పొట్టలో కొవ్వును క‌రిగించాల‌నుకునే వారికి వెల్లుల్లికి మించిన ఔషధం లేదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన వెల్లుల్లి పొట్ట‌లో పేరుకుపోయిన అనవసర కొవ్వును ఇట్టే కరిగించేస్తుందని నిపుణులు అంటున్నారు.

ఉద‌యాన్నే వెల్లుల్లిని తీసుకోవ‌డం ద్వారా పొట్ట‌లో కొవ్వును తగ్గించుకోవచ్చని వెల్లడిస్తున్నారు నిపుణులు.

వెల్లుల్లిలో ఉండే స‌ల్ఫ‌ర్ శ‌రీరంలోని మ‌లినాల‌ను తొల‌గించి జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా సహాయపడుతుంది అంటున్నారు.

జీవక్రియల వేగం పెంచేందుకు ఉపయోగపడే ఔషధాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటాయి. ఆహార పదార్థాలతో కలపకుండా నేరుగా తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగిపోతుంది.

బ‌రువు త‌గ్గ‌డంలో వెల్లుల్లి ప్రముఖ పాత్ర పోషిస్తుంద‌ని అధ్యయనకారులు తెలిపారు. రోజూ ఉద‌యాన్నే గోరువెచ్చ‌ని నీటిలో వెల్లుల్లిని నాన‌బెట్టి తాగడం వల్ల ఫలితం ఉంటుంది.

నిమ్మరసంలో వెల్లుల్లిని కలుపుకోవడం, వెల్లుల్లి గ్రీన్ టీ తీసుకోవ‌డం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. పడని వారు మాత్రం కొద్ది కొద్దిగా తీసుకుంటూ అల‌వాటు పడటం బెటర్‌.