కొన్ని ఆహారాల మార్పులతో ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్..
07 November 2023
ఆహార నియమాలు పాటించకుంటే ఫ్యాటీ లివర్ తీవ్రత మరింత ముదిరే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాలేయ వాపు వ్యాధితో బాధపడుతున్న వారు వెల్లుల్లి తీసుకోవడం ద్వారా ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
వెల్లుల్లిలో కొవ్వును తగ్గించగల శక్తితోపాటు ఆరోగ్యానికి మేలు చేసే చాలా పోషకాలు ఉన్నాయని పోషకాహర నిపుణులు వెల్లడించారు.
శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను తొలగించి ఫ్యాటీ లివర్‌ని సమస్యను తగ్గించడంలో గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కీలకంగా పని చేస్తాయి.
అవకాడోలోని పోషకాలు ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించి కాలేయాన్ని ఎంతో సురక్షితంగా ఉంచడంతో పాటు బరువు తగ్గడానికి సాయపడతాయి.
కాలేయంలో వాపు సమస్య ఉన్నవాళ్లు పాస్తా, ఫ్రైడ్ రైస్, వైట్ బ్రెడ్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను ముట్టుకోకపోవడం చాలా మంచింది.
ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. శరీరంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణం అవుతాయి.
ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు చక్కెరలు ఎక్కువగా ఉండే చాక్లెట్, లడ్డూ, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ లాంటి పదార్థాల జోలికి వెళ్లకూడదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి